అమలాపురం పంచాయతీరాజ్ కార్యనిర్వాహక ఇంజనీర్ గా కర్నూలు డివిజన్ నుంచి బదిలీపై వచ్చిన రామకృష్ణారెడ్డి గురువారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు కార్యాలయం ఉద్యోగులు, సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. ఛార్జ్ తీసుకున్న అనంతరం ఆయన జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. పంచాయతీరాజ్ డివిజన్, సబ్ డివిజన్ సిబ్బంది రాంబాబు, తదితరులు ఆయనను అభినందించారు.