అమలాపురం డివిజన్ పరిధిలో ఈనెల 30 వరకు సెక్షన్ 30 యాక్ట్ అమలులో ఉంటుందని అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కె ప్రసాద్ గురువారం తెలిపారు. అమలాపురం టౌన్, రూరల్, అల్లవరం, ఉప్పలగుప్తం, ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐ. పోలవరం మండలాల పరిధిలో ఉన్న ప్రాంతాలకు ఇది వర్తిస్తుందన్నారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ఏ విధమైన సభలు, సమావేశాలు, ఊరేగింపులు, ర్యాలీలు జరుపరాదన్నారు. వీటి కోసం అనుమతి తీసుకోవాలని చెప్పారు.