ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి

57చూసినవారు
ద్విచక్ర వాహన చోదకులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అనపర్తి ఎస్సై శ్రీను నాయక్ సూచించారు. అనపర్తి లో గురువారం సాయంత్రం హెల్మెట్ లేకుండా వాహనాల నడిపే వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. హెల్మెట్ ధరించడం వల్ల ఉపయోగాలను వివరించారు. ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారితో హెల్మెట్లు కొనిపించారు. హెల్మెట్ లేకుండా, మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్