విజయవాడ సమీపంలోని కేశరపల్లిలో ఆదివారం జరిగే హైందవ శంఖారావంకు జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం నుండి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సూచనల మేరకు మండల బీజేపీ అధ్యక్షుడు యాడాలి రాంబాబు ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో కూటమి నాయకులు విజయవాడకు ప్రత్యేక బస్సులో బయల్దేరారు. మండల ఉపాధ్యక్షులు జ్యోతుల దుర్గాప్రసాద్, శరకణం రాజబాబు, పలువురు కూటమి నాయకులు, హైందవ మత పెద్దలు బయల్దేరిన వారిలో ఉన్నారు.