ట్రాఫిక్ నియంత్రణకు స్వచ్ఛంద సంస్థలు, మెడ్వే సంజీవని ఆసుపత్రిల సేవలు అభినందనీయమని కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు పేర్కొన్నారు. కాకినాడలో మంగళవారం మెడ్వే సంజీవని ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. సూర్య ప్రసాద్, సెంటర్ హెడ్ ఆర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియంత్రణకు భారీ గేట్లను పోలీసులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, వాహనాల మళ్ళింపుకు ఉపయోగపడతాయన్నారు.