రాజకీయంగా ఎదుర్కొనలేకే తిరుపతి లడ్డూ ప్రసాదం ద్వారా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేస్తోందని, దమ్ముంటే ఆరోపణలను నిజమని నిరూపించాలని మాజీ ఎంపీ వంగా గీత విశ్వనాథ్ సవాల్ విసిరారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్లో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. తిరుపతి లడ్డు వ్యవహారంపై సిట్ పేరిట చంద్రబాబు తమకు కావాల్సిన మనుషులతో విచారణ జరిపిస్తే ఎలా అని ప్రశ్నించారు.