కాకినాడ: జిల్లాలో పెరిగిన సైబర్ నేరాలు

82చూసినవారు
కాకినాడ జిల్లాలో సైబర్ నేరాలు అధికంగా జరిగాయని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. సోమవారం కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా వార్షిక నేర గణాంకాలను ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. గతేడాది 1854 కేసులు నమోదు కాగా రూ.8.32కోట్ల దోపిడి జరిగిందన్నారు. ఈ ఏడాది 2672 కేసులు నమోదు కాగా రూ.26.87కోట్ల దోపిడి జరిగిందని తెలిపారు. సైబర్ నేరాలపై టోల్ ఫ్రీ నంబర్(1930)కు ఎక్కువ ఫిర్యాదులు అందాయన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్