జనసేనలోకి భారీ చేరికలు

3869చూసినవారు
పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు అకర్షితులై పలువురు జనసేనలోకి చేరుతున్నారని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కందుల దుర్గేష్, జనసేన పిఎసి సభ్యులు పంతం నానాజీ లు తెలిపారు. కాకినాడ ముత్తా క్లబ్ వద్ద జనసేన సీనియర్ నాయకులు సలాది శ్రీనివాస బాబు ఆధ్వర్యంలో వాకలపూడి వలసపాకుల గ్రామాలకు చెందిన పలువురు బిసి నాయకులు కందుల దుర్గేష్ సమక్షంలో పంతం నానాజీ కండువను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు నుంచి మీరందరూ జనసేన పార్టీ కార్యకర్తలని ప్రతి ఒక్కరూ క్రియాశీలకంగా పార్టీలో పనిచేసి పార్టీని గెలిపించేందుకు కృషి చేయాలని తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్