సర్పవరంలో ఎమ్మెల్యే కన్నబాబు ప్రచారం

1861చూసినవారు
కాకినాడ రూరల్ నియోజకవర్గం సర్పవరం గ్రామంలో ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే కన్నబాబు, వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సర్పవరం గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిని గమనించి మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్