
కాకినాడ రూరల్: హాకీ టోర్నమెంట్ నిర్వహణకు చురుకుగా ఏర్పాట్లు
2024-25 ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ పురుషులు, మహిళల టోర్నమెంట్ ను కాకినాడలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలోని ఆస్ట్రో టర్ఫ్ హాకీ ఫీల్డ్ వేదికగా నిర్వహించేందుకు సన్నాహక ఏర్పాట్లు చురుకుగాజరుగుతున్నాయి. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ కల్చరల్ అండ్ స్పోర్ట్స్ బోర్డ్ ఆద్వర్యంలో ఈ నెల 15వ తేదీ నుండి 28వ తేదీ వరకూ నిర్వహిస్తున్నారు. మంగళవారం జిల్లా క్రీడా అధికారి శ్రీనివాస్ ఏర్పాట్లను పరిశీలించారు.