రాజమండ్రిలోని వీరభద్రపురం మున్సిపల్ టౌన్ హై స్కూల్ నందు సమరసత సేవ ఫౌండేషన్, గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలకు సంబందించిన కిట్స్ ను గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ పాల్గొని మాట్లాడారు. రాబోయే 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రతి ఒక్కరు ఉత్తీర్ణులు అవ్వాలని సూచించారు.