సంక్రాంతి పండుగ సందర్భంగా గత మూడు రోజులుగా వేసిన కోడిపందేలపై పోలీసులు దాడి చేసి ద్వంసంచేశారు. తూ. గో జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఆదేశాలతో బుధవారం సాయంత్రం కోడి పందేలపై దాడులు చేశారు. ఈ మేరకు కాతేరులో నిర్వహిస్తున్న పందేలపై పోలీసులు దాడి చేసి ద్వంసం చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన టెంట్లను తొలగించారు. పందేలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.