డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం సూర్యారావుపేట గ్రామానికి చెందిన వాసంశెట్టి సుబ్బారావు శ్యామల దంపతుల ప్రధమ కుమార్తె వాసంశెట్టి వసంత లక్ష్మి ప్రమాదవశాస్తు రెండవ అంతస్తు పైనుంచి కింద పడడం వలన తీవ్రగాయాలు కావడంతో ఆమెను రాజమహేంద్రవరం విజయ్ హాస్పిటల్లో చికిత్స నిమత్తం తరలించారు. చికిత్స పొందుతున్న వసంత లక్ష్మి వైద్య ఖర్చులకు సుమారు 8 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. ఏమి చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఆమె కుటుంబ సభ్యులు దాతల సహాయం కోరగా ఈ విషయం తెలుసుకున్న ఆలమూరు సబ్ ఇన్స్పెక్టర్ సోమన శివప్రసాద్ ఆమె కుటుంబ సభ్యులను చరవాని ద్వారా పరామర్శించి వసంతలక్ష్మి ఆరోగ్య యోగక్షేమాలు అడిగి తెలుసుకుని ఆమె వైద్య ఖర్చుల నిమిత్తం పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి ఆయన ద్రాతృత్వాన్ని చాటుకున్నారు. అనంతరం ఆమెకు నాణ్యమైన వైద్యాన్ని అందివ్వాలని వైద్యులను కోరారు. ఎవరైనా సహాయం చేసే దాతలు ఉంటే ముందుకు రావాలని ఆయన తెలియజేశారు.