కోనసీమ తిరుమల ఆత్రేయపురం మండలం వాడపల్లిలో శ్రీవెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. వివిధ వేషధారణలు, డప్పు విన్యాసాల మధ్య కళాకారులు అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు. శక్తి వేషధారణలో రాక్షస సంహారం ఘట్టం చూపరులను ఆకట్టుకుంది.