డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం అవిడి నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షునిగా టిడిపి నేత రెడ్డి తాతాజీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నీటి వినియోగదారుల సంఘం ఎన్నికల్లో వైసిపి పోటీ చేయకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవం అనివార్యం అయింది. నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షునిగా ఎన్నికైన తాతాజీని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.