నూతన సంవత్సర వేడుకలలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఎస్పీ నరసింహ కిషోర్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం కొవ్వూరులో రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని ఎస్పీ సందర్శించారు. పండుగను యువత కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకోవాలని, మద్యం సేవించి రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.