టీడీపీ ఆవిర్భావంతోనే రాష్ట్రంలో సామాజిక, సంక్షేమ విప్లవం మొదలైందని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు పేర్కొన్నారు. శనివారం కాకినాడ నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తొలిత నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు, నగర సూర్యప్రసాద్, తాతాజీ తదితరులు తెలుగుదేశం జెండా ఆవిష్కరించారు.