మండపేట: మద్యం షాపు ఏర్పాటును అడ్డుకున్న స్థానికులు

72చూసినవారు
మండపేట పట్టణంలోని సప్తగిరి థియేటర్ సమీపంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయడాన్ని స్థానిక మహిళలు అడ్డుకున్నారు. ప్రభుత్వం వద్ద మద్యం షాపును దక్కించుకున్న పాట దారుడు గురువారం షాపు తెరిచేందుకు సమయక్తం అవుతుండగా 28, 29, 30 వార్డుల్లో మహిళలు అడ్డుకున్నారు. మండపేట ఏఎస్ఐ చిన్నారావు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. ఇక్కడ షాపు ఏర్పాటు చేస్తే ఆందోళన మరింత ఉదృతం చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్