కూటమి ప్రభుత్వం వాలంటీర్స్ నమ్మించి మోసం చేసిందని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. సోమవారం శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం వాలంటీర్స్ జీతాలను రూ.5వేల నుండి రూ.10వేలకు పెంచుతామని మోసం చేయడమే కాకుండా వారి ఉద్యోగాలను కూడా ప్రశ్నార్థకం చేసిందన్నారు. తమ ప్రభుత్వం తప్పు చేసిందని చిత్తశుద్ధి ఉంటే మేనమేషాలు లెక్కించకుండా కూటమి ప్రభుత్వం వెంటనే వాలంటీర్స్ కు తగిన న్యాయం చేయాలన్నారు.