ఎమ్మెల్యే దాట్లకు సత్కారం

51చూసినవారు
ఎమ్మెల్యే దాట్లకు సత్కారం
ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి నూతనంగా ఎన్నికైన దాట్ల సుబ్బరాజును తాళ్లరేవు ఎంపీపీ రాయుడు సునీత ఆదివారం ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే దాట్ల తొలిసారిగా మండల పరిషత్ కార్యాలయానికి విచ్చేయడంతో ఆయన్ను దుశ్శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో కురుపూడి శివన్నారాయణ, ఎంజీ సూర్యనారాయణ, ఉంగరాల వెంకటేశ్వరరావు, రాయుడు గంగాధర్, పొన్నామండ రామలక్ష్మి, పిల్లి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్