ఐ. పోలవరం మండలం మురమళ్ల శ్రీ వీరేశ్వర స్వామి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఏడవ రోజు బుధవారం భద్రకాళి అమ్మవారిని వెండి చీరతో దేదీప్యమానంగా అలంకరించారు. రజిత చీరతో అలంకార శోభితమైన అమ్మవారు భక్తులకు కన్నుల పండుగగా దర్శనమిచ్చారు. అమ్మవారి సౌందర్య రూపాన్ని దర్శించుకున్న భక్తులు మంత్రముగ్ధులయ్యారు. ఇక్కడ శరన్నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని నిర్వహకులు తెలిపారు.