ముమ్మిడివరం మండలం అనాతవరంలో గురువారం జరిగిన ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన శ్రీనివాసరావు (39) మృతి చెందాడు. మినీ లారీపై కొబ్బరికాయ లోడు దింపి తిరిగి వస్తుండగా అనాతవరం భీమనపల్లి రోడ్డులో వ్యాను అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో డ్రైవర్ శ్రీనివాసరావు క్యాబిన్లో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. ముమ్మిడివరం ఎస్సై జ్వాలాసాగర్ దీనిపై కేసు నమోదు చేశారు.