డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కుమారుడికి మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంపై నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. సింగపూర్ లో చదువుతున్న మార్క్ శంకర్ కు జరిగిన అగ్నిప్రమాదంలో గాయాలు కావడం బాధాకరం అన్నారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోని చిరునవ్వుతో తిరిగి పాఠశాల జీవితం ప్రారంభించాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా పార్థించినట్లు తెలిపారు.