ప్లాట్ రిక్షా కార్మికులకు స్టాండ్ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి గ్రీష్మ కుమార్ కోరారు. నిడదవోలు కాపు కళ్యాణ మంటపం వద్ద ఐ. యఫ్. టి. యు అనుబంధ ప్లాట్ ఫారం రిక్షా వర్కర్స్ యూనియన్ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. సభకు యూనియన్ ప్రెసిడెంట్ కోనేటి మల్లేశ్వర రావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవాధ్యక్షులు పిచ్చా సూర్య కిరణ్, తదితరులు పాల్గొన్నారు.