గొల్లప్రోలు పట్టణ శివారు తాటిపర్తి జంక్షన్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గొల్లప్రోలుకు చెందిన చేదులూరి పద్మరాజు అనే చంటబ్బాయి(58) మృతిచెందాడని ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. ఈయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కూలీ పని నిమిత్తం సైకిల్ పై వెళ్తున్న తరుణంలో కత్తిపూడి నుండి పిఠాపురం వైపు వెళుతున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృతి చెందాడన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.