రాష్ట్ర వ్యాప్తంగా శనివారం జరిగిన నీటి సంఘం ఎన్నికల్లో కూటమి సభ్యులు 100% గెలిచారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం రాత్రి పిఠాపురంలోని పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గంలో గెలిచిన నీటి సంఘం అధ్యక్షులను సన్మానించారు. గెలిచిన అభ్యర్థులంతా రైతుల వెన్నంటే ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు