యు. కొత్తపల్లి మండలం కోనపాపపేట గ్రామంలో మత్స్యకారులు గురువారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అక్కడకు వెళ్లిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కాకినాడ డీఎస్పీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ శాంతిభద్రతలు కాపాడటానికి డీఎస్పీని ఎస్పీ పంపారు. ఆయనేమో ఘటనా స్థలానికి రాకుండా సుమోలో ఏసీ వేసుకుని పడుకున్నారు. గొడవకు అసలు కారణం ఆయనకు ఎలా తెలుస్తుంది. మేమేనేరుగా ఎస్పీని కలిసి సమస్యపై చర్చిస్తామని వర్మ అన్నారు.