సైరన్ వేస్తూ జనసేన నేత తన వాహనంతో పిఠాపురంలో గురువారం రాత్రి హల్చల్ సృషించారు.సృష్టించారు. జనసేన నాయకుడు శ్రీను తన వాహనంలో ప్రభుత్వ అధికారులు, పోలీసు వాహనాలకు వినియోగించే సైరన్ వేస్తూ తిరుగుతుండటంతో పిఠాపురం పట్టణ ఎస్ఐ మణికుమార్ వాహనాన్ని ఆపివేశారు. సైరన్ ఉపయోగించకూడదని ఎస్ఐ సూచించారు. ఈలోగా కాకినాడ జిల్లాకు చెందిన ఒక కీలక ప్రజాప్రతినిధి నుంచి ఫోన్ రావడంతో పోలీసులు వాహనాన్ని వదిలివేశారు.