పిఠాపురం: చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
సమాజంలో ప్రతిఒక్కరూ తప్పనిసరిగా చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి ఎం. బాబు సూచించారు. పిఠాపురం మండలం కుమారపురంలో శనివారం మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రజలకు పలు చట్టాలపై అవగాహన కల్పించారు. శాంతియుత జీవనానికి అవసరమైన పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం చట్టాలపై అవగాహన కల్పిస్తూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు