పిఠాపురం: పారా లీగల్ వాలంటీర్లకు దరఖాస్తులు
పిఠాపురం నియోజకవర్గంలో పారా లీగల్ వాలంటీర్లుగా పని చేసేందుకు ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని పిఠాపురం 12వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎ. వాసంతి ఓ ప్రకటనలో బుధవారం కోరారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ పోస్టులు భర్తీ చేస్తున్నామన్నారు. 18 ఏళ్లు నిండి, పదో తరగతి ఉత్తీర్ణులైన వారు డిసెంబర్ 21లోపు దరఖాస్తులు మండల న్యాయ సేవా సంస్థ అధికారులకు అందించాలన్నారు.