వైసీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. ద్వారంపూడి సోదరుడు వీరభద్రారెడ్డికి చెందిన ఎక్స్‌పోర్ట్స్ కంపెనీని అధికారులు సీజ్ చేశారు. ప్రత్తిపాడు మండలం లంపక లోవలోని వీరభద్ర ఎక్స్‌పోర్ట్స్ రొయ్యల శుద్ధి కర్మాగారాన్ని విశాఖ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మూసేశారు. గత ఏడాది ఆగస్టు 6న కరప మండలం గురజానపల్లిలో ద్వారంపూడి కుటుంబానికి చెందిన రొయ్యల శుద్ధి పరిశ్రమను మూసివేసిన సంగతి తెలిసిందే.