ప్రత్తిపాడులో నిర్వహించిన ఆడుదాం–ఆంధ్రా నియోజకవర్గ స్థాయి క్రీడాలల్లో భాగంగా ఏలేశ్వరం మండలానికి చెందిన అక్కాచెల్లెళ్లు అడ్డూరి సుధ, ధరణి బ్యాడ్మింటన్ మహిళల డబుల్స్ విభాగంలో ప్రథమ బహుమతి కైవసం చేసుకున్నారు. ఈ మేరకు బ్యాడ్మింటన్ మహిళల డబుల్స్ విభాగంలో జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఉన్నత ప్రతిభను కనబరచిన వారిని పలువురు అభినందించారు.