గడచిన ఐదేళ్లలో ప్రజలకు చేసిన అభివృద్ధి ఏమిటని వైసీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డిని అనపర్తి మండల బీజేపీ అధ్యక్షుడు సత్య మంగళవారం ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు, గ్రామ సచివాలయ కన్వీనర్ నల్లమిల్లి మణికంఠ రెడ్డి అనేకమంది మహిళలు, ఉద్యోగులను లైంగికంగా వేధించడంతో ఇటీవల అరెస్ట్ చేశారని అన్నారు. ఇలాంటి వారికి మాజీ ఎమ్మెల్యే వత్తాసు పలకడం హేయమైన చర్య అన్నారు.