రాజమండ్రి రైల్వే స్టేషన్ సమీపంలో స్వచ్ఛత హీ సేవ-2024 కార్యక్రమం మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ ఏ. విన్నూతన ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు, విద్యార్థులతో కలిసి పరిసరాలను పరిశుభ్రం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ స్వచ్ఛత, పరిశుభ్రతపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.