నేటి నుంచి ఉచిత టెన్నిస్ శిక్షణ శిబిరం ప్రారంభం

68చూసినవారు
నేటి నుంచి ఉచిత టెన్నిస్ శిక్షణ శిబిరం ప్రారంభం
రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఉచిత టెన్నిస్ శిక్షణ శిబిరాన్ని మంగళవారం నుంచి ప్రారంభిస్తున్నట్టు ఆర్ట్స్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ముళ్ల మాధవ్ సోమవారం తెలిపారు. ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఈ శిక్షణ శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ ఆర్. కె. రామచంద్ర ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. టెన్నిస్ క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్