రాజమండ్రి: ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి

53చూసినవారు
నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఎమ్మెల్యేగా తమ వంతు కృషి చేస్తున్నట్లు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. గురువారం మంత్రి నారా లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా రాజమండ్రిలో ఏర్పాటు చేసిన నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్