రాజమండ్రి: కందుకూరి గృహానికి పూర్వ వైభవానికి కృషి

80చూసినవారు
సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు జన్మగృహాన్ని పరిరక్షించి పూర్వవైభవం తీసుకు వస్తామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. బుధవారం రాజమండ్రిలోని కందుకూరి జన్మగృహాన్ని, మెయిన్ రోడ్డులోని టౌన్ హాల్‌ను నగర పాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గే, నాయకులు, పురావస్తు శాఖ అధికారులతో కలిసి ఆయన సందర్శించారు. చారిత్రక గుర్తలను పదిలంగా ఉంచడానికి తన వంతు కృషి చేస్తానన్నారు.

సంబంధిత పోస్ట్