తూర్పుగోదావరి జిల్లాలోని హైవే పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రధాన ట్రాఫిక్ జంక్షన్లు మొరంపూడి, పిడింగొయ్యి, జేఎన్ రోడ్, ఏవి అప్పారావు రోడ్, లాలాచెరువు ప్రాంతాలను జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ట్రాఫిక్, శాంతి భద్రతల ఇన్స్పెక్టర్లతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ప్రమాదాలు, నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు, స్పీడ్ కంట్రోల్ ట్రాఫిక్ బోర్డ్స్, స్పష్టమైన లైటింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.