ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆర్‌అండ్‌బీ రహదారుల బిల్లుల బాకీలు భారీగా పేరుకు పోయాయి. పూడ్చిన గుంతలు, ఇతర మరమ్మ తులకు బిల్లులు ఆగిపోవడంతో కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన రహదారులకు సంబంధించి గుంతలు పూడ్చాలని సీఎం చంద్ర బాబు ఆదేశించడంతో సంక్రాంతి వరకు ఉమ్మడి జిల్లాలో దాదాపుగా ఈ పనులన్నీ పూర్తిచేశారు. ఉమ్మడి జిల్లాలో రహదారుల బిల్లుల బాకీలు రూ.400కోట్లకుపైగానే పేరుకుపోయాయి. ఇందు లో ప్రస్తుత ప్రభుత్వ హయాంలో గుంతలు పూడ్చిన పనులకు సంబంధించిన బిల్లులు రూ.90 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయి.