కడియం: కాలువలో యువకుడు గల్లంతు

85చూసినవారు
కడియం: కాలువలో యువకుడు గల్లంతు
స్నేహితులతో పాటు స్నానానికి దిగిన యువకుడు గల్లంతైన ఘటన కడియం మండలం జేగురుపాడులో సోమవారం చోటుచేసుకుంది. కోనసీమజిల్లా తోకలంక గ్రామానికి చెందిన గెడ్డం కార్తీక్ అనే యువకుడు స్నేహితులతో కలిసి స్నానానికి దిగాడు. తిరిగి ఒడ్డుకు చేరలేదు. దీనితో గల్లంతైన యువకుడి ఆచూకీ కోసం గాలింపు చర్యల్లో స్థానికులు, స్నేహితులు బంధువులు నిమగ్నమయ్యారు. అతడి తల్లిదండ్రులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సంబంధిత పోస్ట్