కడియం మండలం కడియపులంక గ్రామ పరిధిలోని డ్వాక్రా మహిళా సంఘాలలో అనేక అవకతవకలు జరిగాయని పలు సంఘం సభ్యులు ద్వారా పంచాయతీ దృష్టికి వచ్చిందని సర్పంచ్ రాంజీ మంగళవారం తెలిపారు. దీనిపై తాను మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్థులతో కలిసి మహిళా సంఘాల పై విచారణ జరపాలని ఇటీవల డిఆర్డిఏ పిడికి ఫిర్యాదు చేస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు తాము ఇచ్చిన ఫిర్యాదుపై ఎటువంటి విచారణ జరపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.