రాజమండ్రి నగరాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం రాజమండ్రిలోని 43, 37 డివిజన్లలో సీసీ రోడ్లు& డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. నగర ప్రజల అవసరాల మేరకు రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.