రాజమండ్రి: జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలి

72చూసినవారు
రాజమండ్రి రూరల్ నియోజవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త ఆళ్ళ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం మంత్రి కందుల దుర్గేష్ కార్యాలయం వద్ద పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల కరపత్రాన్ని ఆవిష్కరించారు. పిఠాపురంలో ఈనెల 14వ తేదీన జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్