పేద ప్రజలకు మంచి పరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, గ్రామాల్లో ప్రజల అభీష్టం మేరకే పరిపాలన అందిస్తున్నామని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. శుక్రవారం రాజమండ్రి రూరల్ మండలం కాతేరులో నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంకులను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం సంక్షోభంలోనూ సంక్షేమం అందించి అభివృద్ధి వైపు పరుగులు తీస్తుందని చెప్పారు.