రాజమండ్రి రూరల్: నార్త్ జోన్ డిఎస్పీగా శ్రీకాంత్ బాధ్యతలు

67చూసినవారు
రాజమండ్రి రూరల్: నార్త్ జోన్ డిఎస్పీగా శ్రీకాంత్ బాధ్యతలు
తూర్పుగోదావరి జిల్లా (నార్త్ జోన్) డీఎస్పీగా వై. శ్రీకాంత్ మంగళవారం రాజమండ్రిలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్‌ను జిల్లా పోలీస్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాలతో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా విధులు నిర్వహిస్తానని పేర్కొన్నారు. ఉద్యోగులందరు బాధ్యతగా వహించాలన్నారు.

సంబంధిత పోస్ట్