రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి లేకపోతే మీరెవరో జనానికి తెలిసేది కాదని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ నేతపై వైసీపీ నేత చిట్టూరి ప్రవీణ్ చౌదరి హాట్ కామెంట్స్ చేశారు. శుక్రవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. రాజకీయ భిక్ష పెట్టిన గోరంట్లనే ఆదిరెడ్డి తూలనాడడం ఆశ్చర్యంగా ఉందన్నారు. తనను పార్టీలో చేరమని అడగడంతో పాటు ఆయన వెనకే తిరగాలి తప్ప గోరంట్ల, గన్ని కృష్ణతో కలిసి తిరగవద్దని బెదిరించారన్నారు.