రాజమండ్రి: గీత కార్మికులతో కోలాహలంగా సబ్ కలెక్టరేట్

72చూసినవారు
తూర్పు గోదావరి జిల్లాలో గీత కులాలకు ప్రభుత్వం కేటాయించిన 13 మద్యం షాపులకు గురువారం లాటరీ తీయనున్నారు. ఈ నేపథ్యంలో మద్యం షాపుల కోసం దరఖాస్తు చేసుకున్న వారితో రాజమండ్రిలోని సబ్ కలెక్టరేట్ కోలాహలంగా మారింది. జిల్లా వ్యాప్తంగా 13 మద్యం షాపులకు 387 దరఖాస్తులు అందాయి. కలెక్టర్ సమక్షంలో జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారిణి చింతాడ లావణ్య లాటరీ తీయనున్నారు.

సంబంధిత పోస్ట్