సీతానగరం మండలంలోని ఇనుగంటివారిపేట, బొబ్బిల్లంక గ్రామానికి పలువురికి సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను రాజానగరం ఎమ్మెల్యే బలరామకృష్ణ సతీమణి, జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కో ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మీ చేతుల మీదుగా శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం సహాయ నిధి ద్వారా నారా చంద్రబాబు రాష్ట్రంలోని పేదల వైద్యానికి అయ్యే ఖర్చులో అత్యధిక భాగాన్ని అందచేస్తున్నారని చెప్పారు.