తూర్పూ గోదావరి జిల్లా రాజానగరం మండలం పల్లకడియ గ్రామంలో విషాదం నెలకొంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పల్లకడియ గ్రామానికి చెందిన అప్పాయమ్మకు కళ్ళు సరిగా కనిపించవు. ఆమె టీ పొడి అనుకోని పురుగుల మందును పాలలో కలిపింది. దీంతో భర్త వెల్చూరి గోవింద్, ఆమె తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వారిని రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దంపతులిద్దరూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.