తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఈనెల 18వ తేదీన రామచంద్రపురం రత్నం పేటలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. లయన్స్ కల్యాణ మండపంలో 18వ తేదీ ఉదయం 9 గంటలకు నిర్వహించనున్న రక్తదాన శిబిరంలో పార్టీ శ్రేణులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.